ఎగిసిపడిన ‘భగీరథ’ 

30 Dec, 2020 01:19 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్‌ – తోటపల్లి రాజీవ్‌ రహదారి సమీపంలో మంగళవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో నీరు ఉవ్వెత్తున్న ఎగిసిపడింది. పెద్దలైన్‌ కావడం.. ప్రెషర్‌ ఎక్కువగా ఉండటంతో రాజీవ్‌ రహదారికి ఇరువైపులా నీళ్లు విరజిమ్మాయి. దీంతో కొంతసేపు ప్రయాణానికి ఆటంకం కలిగింది. సమీపంలోని శనగ పంట పూర్తిగా నీట మునిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. చదవండి: (హమ్మయ్య.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉపశమనం)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు