మియాపూర్‌ సీఐ సస్పెండ్‌.. కారణం ఇదే..

6 Feb, 2024 11:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్‌ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్‌ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్‌ చేశారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega