కరోనా కాలంలో ఆదర్శంగా నిలుస్తున్న అపార్ట్‌మెంట్‌..

18 May, 2021 14:11 IST|Sakshi

మూసాపేట: కొన్ని సరదాలు... సంతోషాలు... కొన్ని రోజులు పక్కనపెట్టి ... కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా దరిదాపుల్లోకి రాదని ఆ అపార్ట్‌మెంట్‌వాసులు పేర్కొంటున్నారు. 60 ప్లాట్స్‌ ఉన్నా ఈ అపార్ట్‌మెంట్‌లో ఇప్పటి వరకు 7 కుటుంబాల వారు మాత్రమే కరోనా బారిన పడ్డారంటే వారు పాటిస్తున్న నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదు. చిన్నారుల పార్కు, జిమ్‌లు బంద్‌ చేశారు. ఉమ్మడిగా చేసుకునే పండగలు, పార్టీలు పక్కన పెట్టారు. చిన్నారులను కూడా ఇళ్లలోనే ఆడిస్తున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే కరోనాను తరిమి వేయవచ్చని, ఆ తర్వాత సంతోషంగా ఉండవచ్చని బాలాజీనగర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రగతీనగర్‌ కాలనీ చివరన ఉన్న ఎంజేఆర్‌ సొలిటర్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు అంటున్నారు.

  • ఎంజేఆర్‌ సొలిటర్‌ అపార్ట్‌మెంట్‌లో 80 ప్లాట్స్, 250కి పైగా జనాభా ఉన్నారు. 
  • ఆన్‌లైన్‌ ఫుడ్స్, డోర్‌ డెలివరీస్‌ సెక్యూరిటీకి ఇచ్చి వెళ్లాలి. ఆ తర్వాత వారు ప్లాట్‌ ఓనర్‌కు అందజేస్తారు.
  • కొత్తవాళ్లు లోపలికి ప్రవేశం లేదు. తెలిసిన వాళ్లయినా, అపార్ట్‌మెంట్‌ వాసులైనా గేట్‌ వద్ద టెంపరేచర్‌ చూసి, శానిటేషన్‌ చేసి లోపలికి పంపిస్తారు. 
  • చిన్నారులు ఆడుకునే పార్కు జిమ్‌ ప్రస్తుతం మూసివేశారు. చిన్నారులను ఇళ్లల్లోనా  ఆడించుకుంటున్నారు. కారిడార్‌లో ముచ్చట్లు లేవు. 
  • శ్రీరామనవమి,ఉగాది వంటి పండగలు, పుట్టిన రోజు ఇతర పార్టీలు బంద్‌ చేశారు. ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకొంటున్నారు.  
  • రోజూ ఉదయం, సాయంత్రం లిఫ్ట్, ఫ్లోర్స్, కారిడార్‌లను శానిటేషన్‌ చేయిస్తున్నారు.  
  • చివరికి కూరగాయలు వారానికి రెండు సార్లు అపార్ట్‌మెంట్‌కు వచ్చి విక్రయిస్తారు. అతనికి కూడా టెంపరేచర్, శానిటేషన్‌ చేసి పంపిస్తారు.  
  • కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సమాచారాన్ని అడుగుతూ వారికి కావాల్సిన సహాయం అందజేస్తున్నారు.

చదవండి:

ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న హైదరాబాద్ సాప్ట్ వేర్ ఉద్యోగి 

మరిన్ని వార్తలు