ఓయూలో సీఎంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌

27 Nov, 2021 07:44 IST|Sakshi
మాక్‌ అసెంబ్లీలో జ్యోతి వెలిగిస్తున్న ఈటల రాజేందర్‌  

ఓయూలో ఆకట్టుకున్న మాక్‌ అసెంబ్లీ 

సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవల హుజూరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఓయూలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మాక్‌ అసెంబ్లీలో ఆయన సీఎం సీట్లో ఆసీనులై ఆదేశాలిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘భవిష్యత్తు తెలంగాణ వేదిక’ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్‌ దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో ఈ మాక్‌ అసెంబ్లీ నిర్వహించగా.. ఈటల రాజేందర్‌ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సెషన్‌ను ప్రారంభించారు. గవర్నర్‌గా సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నాయకులు పేరాల శేఖర్‌రావు వ్యవహరించారు.
చదవండి: ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే దృఢమైన పునాది

ముఖ్యమంత్రి హోదాలో ఈటల మాట్లాడుతూ మన రాజ్యాంగం సామాన్యులకు సైతం కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. ఇటీవలి హుజూరాబాద్‌ ఎన్నికల్లో తన ఓటమికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు తనకు ఓటు వేసి ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. మాక్‌ అసెంబ్లీ స్పీకర్లుగా ఎర్రబెల్లి రజినీకాంత్, సాయికృష్ణారావు, దేవికారెడ్డిని ఎన్నుకోగా  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్, కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్, రాణిరుద్రమ దేవి పాల్గొన్నారు.
చదవండి: యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం

మరిన్ని వార్తలు