Kamareddy: రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదు.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..

7 Jan, 2023 20:28 IST|Sakshi

కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్ జోన్‌ను మారుస్తామని చెప్పారు. గ్రీన్ జోన్ కూడా ప్రభుత్వ భూముల్లోకి మారస్తామని పేర్కొన్నారు.

ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను, ఇండస్ట్రియల్ జోన్‌ నుంచి తొలగిస్తామని తెలిపారు. డీటీసీపీ, కన్సల్టెన్సీ అధికారుల తప్పిదంతోనే గందరళగోళం నెలకొందని గంప వివరణ ఇచ్చారు. రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదని హామీ ఇ‍చ్చారు. కౌన్సిల్ సమావేశం తర్వాత మాస్టర్‌ప్లాన్ ఫైనల్ చేస్తామన్నారు.

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. స్థానిక రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ భూమి పోతోందని పెద్దఎత్తున్న ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. ప్రతిపాదిత ప్లాన్‌పై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు గడువు ఉందని గుర్తు చేశారు.
చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి

మరిన్ని వార్తలు