ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన జగ్గారెడ్డి

29 Dec, 2020 19:00 IST|Sakshi

రేపటి ఒక్క రోజు దీక్ష రద్దు..

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయడంతో ఈ నేపథ్యంలో రేపటి దీక్షను కూడా రద్దు చేశామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు. (చదవండి: ఎల్‌ఆర్‌ఎస్‌ ఎత్తివేత: కేసీఆర్‌ కీలక నిర్ణయం)

కరోనా కారణంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌ఆర్ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం తాము తీవ్రంగా వ్యతిరేకించామని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపు (బుధవారం) గాంధీభవన్‌లో దీక్ష చేస్తామని ప్రకటించామని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ డిమాండ్‌కు దిగొచ్చిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. (చదవండి: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో సీన్‌ మారింది!)

మరిన్ని వార్తలు