యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం

27 Nov, 2021 01:54 IST|Sakshi
రెండు కిలోల బంగారాన్ని ఈఓ గీతారెడ్డికి అందజేస్తున్న ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు  

అందజేసిన నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి

యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన 2 కేజీల బంగారాన్ని ఆలయ ఈఓ గీతారెడ్డికి విరాళంగా అందజేశారు. యాదాద్రీశుడి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు జనార్దన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.

అంతకుముందు బంగారం నాణేలకు ప్రతిష్టామూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన పి.మధుబాబు అనే భక్తుడు బంగారం తాపడం కోసం రూ.1,72,000ను విరాళంగా గీతారెడ్డికి అందజేశారు.  

నాడు భక్త రామదాసు.. నేడు సీఎం కేసీఆర్‌ 
భదాద్రి రామచంద్రస్వామి ఆలయాన్ని నాడు భక్త రామదాసు నిర్మిస్తే.. నేడు సీఎం కేసీఆర్‌ ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని పునర్నిర్మాణం చేస్తు న్నారని జనార్దన్‌రెడ్డి కొనియాడారు. విమాన గోపురానికి బంగారం తాపడంలో తమ కుటుంబం పాత్ర ఉండాలని బంగారాన్ని అందజేశానని, టెంపుల్‌ సిటీపై నిర్మిస్తున్న కాటేజీలకూ రూ.2 కోట్లను జేసీ బ్రదర్స్‌ కంపెనీ తరఫున ఇస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు