ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్‌

1 Dec, 2022 11:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్‌ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ చేయాలని తెలిపింది.

మరిన్ని వార్తలు