వీడియోలు బయటకు, రఘునందన్‌పై కేసు.. ఎమ్మెల్యే రియాక్షన్‌

8 Jun, 2022 09:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి తనపై కేసులు పెడితే లీగల్‌గా ఎదుర్కొంటానని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌ రావు తెలిపారు. నోటీసులు ఇచ్చినా, పోలీసులు అరెస్ట్‌ చేసేం దుకు వచ్చినా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పార్టీ కార్యాల యంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం జరిగే దాకా బాధితురాలి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు.

ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేద న్నారు. అమ్నీషియా పబ్‌ మైనర్‌ అమ్మాయి కేసులో కాంగ్రెస్‌ నేతల పిల్లలు కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలో నిందితులకు శిక్ష పడే వరకు బండి సంజయ్‌ నేతృత్వంలో పోరాడుతామని పేర్కొన్నారు. 
సంబంధిత వార్త: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు

మరిన్ని వార్తలు