పరిహారం సరే.. ముందు లెక్కలు తేల్చండి

2 Oct, 2021 02:16 IST|Sakshi

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్ట పో యారని మంథని ఎమ్మెల్యే  శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం జీరో అవర్‌లో పంటనష్టం, పరిహారం అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరా ల్లో పంటలు నీట ముని గాయని, వరదలతో తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరి హారం చెల్లింపు అంశాన్ని పక్కనపెడితే కనీసం అంచనాలు రూపొందించాలని, ఈ వివరాలను కేం ద్రానికి సమర్పిస్తే కొంతైనా మేలు జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. వర్షా కాలం ముగుస్తోం దని, తక్షణమే స్పందించకుంటే అంచనాలు కూడా రూపొందించే వీలుండదని గుర్తుచేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు