జాఫ్రీకి మరో ఛాన్స్‌ ఇవ్వని ఎంఐఎం.. ఎమ్మెల్సీ క్యాండిడేట్‌గా మీర్జా రహమత్‌ బేగ్‌

21 Feb, 2023 15:13 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: నగర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మీర్జా రహమత్‌ బేగ్‌ను ఎంపిక చేసింది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బేగ్‌ పేరును ఖరారు చేశారు పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ. 

ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్‌ ఉల్‌ హసన్‌ జాఫ్రీకి.. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంతకాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓ ట్వీట్‌ చేశారు ఒవైసీ.  ఇదిలా ఉంటే.. 2018లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రహమత్‌ బేగ్‌. 

మరిన్ని వార్తలు