టీఆర్ఎ‌స్‌ ఎమ్మెల్సి గంగాధర్‌గౌడ్‌కు కరోనా

10 Aug, 2020 09:12 IST|Sakshi
తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌

సాక్షి, డిచ్‌పల్లి: తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నామని వివరించారు. తనతో పాటు సతీమణి, కుమారుడికి పాజిటివ్‌ అని శనివారం అర్ధరాత్రి తెలిసిందని, కోడలు, గన్‌మన్, డ్రైవర్‌కు నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

37 మందికి పాజిటివ్‌
నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. ఆదివారం 37 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,843కు చేరింది. తాజా కేసుల్లోనే నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. ముబారక్‌నగర్, సీతారాం నగర్‌ కాలనీ, వీక్లీ మార్కెట్, పద్మానగర్, సాయినగర్, గౌతంనగర్, ఎన్‌ఆర్‌ఐ కాలనీలలో కేసులు నమోదయ్యాయి. వేల్పూరు, మంథని, ఆలూరు, దుద్‌గాం, వెల్మల్‌ తదితర ప్రాంతాల్లోనూ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.

కరోనాతో ఒకరి మృతి
వర్ని(బాన్సువాడ): వర్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి (50) కరోనాతో మృతి చెందాడు. సదరు వ్యక్తికి ఇటీవల పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

మాచారెడ్డి: మండలంలోని ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మహిళ (63) కరోనా ఆదివారం సాయంత్రం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మరిన్ని వార్తలు