పీర్ల పండుగలో ‘గోరటి’ సందడి 

21 Aug, 2021 10:42 IST|Sakshi

తెలకపల్లి: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. శాసనమండలికి ఎంపికైన తర్వాత తొలిసారి వచ్చిన పీర్ల పండుగలో సందడి చేశారు. ఆయన స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారంలో పీర్ల చావడిలో గురువారం రాత్రి ఫాతేహా నిర్వహించారు. పీర్లకు దట్టీలు సమర్పించి, మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి అగ్ని గుండం చుట్టూ ఆడిపాడారు.   

టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతాం: ఠాగూర్‌ 
సాక్షి, నాగర్‌కర్నూల్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతా మని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్లమెంట్‌ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అన్నిరంగాల్లో గుణాత్మకమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందన్నారు. పార్టీలో సెప్టెంబర్‌ 30లోగా ప్రతి బూత్‌కు ముగ్గురుసభ్యుల చొప్పున కమిటీ నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.   సమావేశంలో సీనియర్‌ నేతలు మల్లు రవి, బోసు రాజు, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, మహేశ్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు