ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం

25 Feb, 2021 17:53 IST|Sakshi

జగిత్యాల: సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది. సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమెకు ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన కల్వకుంట్ల కవిత కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రాజారాంపల్లి వద్దకు రాగానే జగిత్యాల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కారు కొద్దిగా తగిలింది. అప్రమత్తమైన కవిత కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్ కార్లలోనే ఉన్నారు. అయితే వారికి గాయాలు కాలేదని.. సురక్షితంగా బయటపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు