Delhi Liquor Scam: తగ్గేదేలే.. బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా!

22 Aug, 2022 14:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణం తెలంగాణకు తాకింది. లిక్కర్‌ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.. కాగా, బీజేపీ ఆరోపణలపై కవిత పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆమె చర్చలు జరిపారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌: కేసీఆర్‌ కూతుర్ని కాబట్టే టార్గెట్‌ చేశారు.. కవిత ఫైర్‌ 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్‌ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని కవిత అన్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదు. బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు