లెక్కలు తప్పులైతే ముక్కు నేలకు రాస్తా..

7 Mar, 2021 07:52 IST|Sakshi

భద్రాచలం: రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలన్నీ వాస్తవమేనని, ఆ లెక్కల్లో తప్పులున్నాయని ఆరోపణలు చేస్తున్న పార్టీలు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం కేకే ఫంక్షన్‌హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీల్లో భాగంగా కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానం మేరకు నిరుద్యోగులకు లక్షకు పైగా ఉద్యోగాలు అందాయని, ఈ లెక్కలు తప్పులని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెల్లం వెంకట్రావు, బోదెబోయిన బుచ్చయ్య పాల్గొన్నారు.  

అశ్వాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పదే పదే ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలంటున్నారని, ప్రశ్నించడం ఎవరికైనా సాధ్యమని, సమస్యలను పరిష్కరించే గొంతుకను ఎన్నుకోవాలని ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని గౌతమీనగర్‌ కాలనీలోని అతిథి గృహంలో శనివారం భారజల కర్మాగారం ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో ఆయన ప్రత్యేక సమావేశమయ్యారు. ముత్తినేని సుజాత, బాణోత్‌ శారద, సదర్‌లాల్, పాడ్య కేశవరావు, మోహన్‌రావు, వెంకటరెడ్డి, డీవీ రావు, డీవీ చారి, కూరపాటి శ్రీనివాసరావు, పెదిరెడ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

చదవండి: మా మౌనం.. గోడకున్న తుపాకీ

మరిన్ని వార్తలు