సిద్దిపేటలో షీ మొబైల్‌ టాయిలెట్‌ 

18 Jun, 2021 09:11 IST|Sakshi

 రూ.20 లక్షల వ్యయంతో రూపకల్పన 

త్వరలో అందుబాటులోకి బస్‌ టాయిలెట్‌  

సాక్షి, సిద్దిపేట: సభలు, సమావేశాలు జరిగే చోట, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మరుగుదొడ్డి సౌకర్యంలేక మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ షీ బయో మొబైల్‌ టాయిలెట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రూ.20 లక్షల వ్యయంతో ఈ మొబైల్‌ టాయిలెట్‌ బస్‌ను రూపొందించారు. ఈ బస్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. ఇందులో తల్లులు పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేక గదిని సైతం ఏర్పా టు చేశారు. బస్‌లో నాలుగు టాయిలెట్లు, వెయిటింగ్‌ కోసం కుర్చీలు ఉంటాయి. త్వరలోనే ఈ బస్‌ను ప్రారంభించనున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు