రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు 

9 Oct, 2022 02:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు (ఆది, సోమ) పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రానికి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వెల్లడించింది.

ఈ గాలుల ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.    

మరిన్ని వార్తలు