రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ సలీం  

10 May, 2022 02:30 IST|Sakshi
మహ్మద్‌ సలీంకు శుభాకాంక్షలు  తెలుపుతున్న హోంమంత్రి మహమూద్‌ అలీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌గా మహ్మద్‌ సలీం ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌ హజ్‌హౌస్‌లో జరిగిన పాలక మండలి సభ్యుల సమావేశానంతరం.. సలీం చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షహనవాజ్‌ ఖాసిం ప్రకటించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ.. సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ మసీ ఉల్లాఖాన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు