పెళ్లికి అనుకోని అతిథి, అంతా షాక్‌!

12 Sep, 2020 13:02 IST|Sakshi

సాక్షి, ములుగు: కరోనా మహమ్మారి తోటి మనుషుల మద్య ‘దూరం’ పెంచింది. మొహానికి మాస్కు అంటించింది. వైరస్‌ భయాలు, ప్రభుత్వ నిబంధనలతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లిళ్లు సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ఎంతటి వారి పెళ్లిళ్లలోనైనా అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో తానే  విషిష్ట అతిథై ఓ వానరం (కోతి) ఈ నూతన జంటకు ఆశీస్సులు అందించింది. తలంబ్రాల సందర్భంలో తాను చెయ్యి కలిపి మనసార ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఓ వివాహ సమయంలో చోటు చేసుకుంది. వధూవరులు నూగురు వెంకటాపురానికి చెందినవారు. ఈ అద్భుత సంఘటనతో బంధువుల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం ఆనందం ఉరకలేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు