ఖమ్మంలో మంకీపాక్స్ లక్షణాలతో వ్యక్తి.. హైదరాబాద్‌కు తరలింపు

26 Jul, 2022 20:43 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడటంతో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి  ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంకీపాక్స్ లక్షణాలతో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అతని వ్యాధి లక్షణాలు మంకీపాక్స్‌గా గుర్తించిన ఆ ఆస్పత్రి వైద్యులు డీఎంహెచ్ఓకి సమాచారం అందించారు. డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు రోగిని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

మంకీపాక్స్ కాదని కేవలం లక్షణాలు కనిపించాయని.. ముందు జాగ్రత్త చర్యల్లో  భాగంగా హైదరాబాద్‌కి పంపించామని వైద్యులు చెప్తున్నారు. పూర్తి పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తాయని చెప్పారు. కాగా, మంకీపాక్స్ లక్షణాలతో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చేరిన కామారెడ్డి వాసికి వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అతని శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ లాబ్‌కు పంపగా.. రిపోర్టు మంగళవారం వచ్చిందని వైద్యులు తెలిపారు. 
(చదవండి: యూపీలో మంకీపాక్స్‌ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌!)

మరిన్ని వార్తలు