హమ్మయ్య.. అతనికి మంకీపాక్స్ నెగెటివ్‌.. వెల్లడించిన వైద్యులు

26 Jul, 2022 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి:  మంకీపాక్స్ లక్షణాలతో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చేరిన కామారెడ్డి వాసికి వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అతని శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ లాబ్‌కు పంపగా.. రిపోర్టు మంగళవారం వచ్చిందని వైద్యులు తెలిపారు. అతనికి మంకీపాక్స్ లేదని నిర్ధరణ అయినట్లు వెల్లడించారు.

35 ఏళ్ల ఈ వ్యక్తి ఈ నెల మొదటి వారంలో కువైట్‌ నుంచి కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చేరుకున్నాడు. తీవ్ర జ్వరం అటుపై అతనిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. అదనపు టెస్టుల కోసం హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఐదు రకాల శాంపిల్స్‌ తీసి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
చదవండి: ‘మంకీపాక్స్‌’ కలకలంపై వైద్యాధికారుల స్పందన

మరిన్ని వార్తలు