వాతావరణంలో వేగంగా మార్పులు...త్వరలోనే తొలకరి

17 May, 2022 00:31 IST|Sakshi

అండమాన్‌ నికోబార్‌ దీవులకు చేరిన ‘నైరుతి’

రుతుపవనాల రాకతో వాతావరణంలో వేగంగా మార్పులు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు

కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు.. తేమ వల్ల ఉక్కపోత

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్, నికోబార్‌ దీవులతోపాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలి పింది.

కానీ వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రత అనుభూతి ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నల్లగొండలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని ప్రకటించింది.  

మరిన్ని వార్తలు