ఉస్మానియా ఆసుపత్రిలో పాపం పసిపాప!

2 Apr, 2021 11:16 IST|Sakshi

సాక్షి, అఫ్జల్‌గంజ్‌: పసిపాపను ఓతల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పసిపాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తీసుకు వచ్చింది.  వైద్యులు పాపను మెరుగైన చికిత్స నిమిత్తం ఏఎంసీ వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తర్వాత ఇప్పుడే వస్తాను, పాపను చూడండి అని ప్రక్క బెడ్‌పై ఉన్న పేషంట్‌కు చెప్పి సదరు మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

దీంతో ఆసుపత్రి సిబ్బంది అవుట్‌ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా? ఆడపిల్ల అని వదిలి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు  చేస్తున్నారు. చికిత్స అనంతరం పాపను శిశు విహార్‌కు తరలిస్తామని తెలిపారు.  

చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని..
అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి

మరిన్ని వార్తలు