ఇంటికి రా బిడ్డా.. మావోయిస్టులో ఉన్న కొడుకును కోరిన తల్లి

2 Jul, 2021 10:49 IST|Sakshi
సుధాకర్‌ తల్లికి సరుకులు అందజేస్తున్న డీఎస్పీ

సాక్షి, చిట్యాల(వరంగల్‌): మావోయిస్టుల్లో సైతం కరోనా వైరస్‌ కలవరం సృష్టిస్తుండడం, తాము కూడా వృద్ధాప్యానికి చేరుకున్నామని ఇంటికొచ్చి పని చేస్తూ తమను చూసుకోవాలని మావోయిస్టు నాయకుడు సెరిపల్లి సుధాకర్‌ తల్లి రాయపోషమ్మ కంటతడి పెట్టింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సుధాకర్‌ 2002లో అడవి బాట పట్టాడు. ప్రస్తుతం అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్నందున ఇంటికి రావాలని ఆమె కోరింది.

ఈ మేరకు గురువారం భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, తదితరులు ఆమెను కలిసి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఇక ముందు ఎలాంటి సాయం కావాలన్న పోలీస్‌శాఖ తరఫున చేస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూసుకునేందుకు సుధాకర్‌ జనంలోకి వస్తే ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

చదవండి: కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు 
 

>
మరిన్ని వార్తలు