పుట్టుకతోనే మూగ, చెవుడు.. అవేవి అతన్ని ఆపలేకపోయాయి

1 Dec, 2021 13:48 IST|Sakshi
బైక్‌ టైర్‌ పంక్చర్‌ చేస్తున్న వాహిద్‌ అలీ

సాక్షి,అర్వపల్లి(నల్గొండ): ఆ యువకుడికి పుట్టుకతోనే మూగ , చెవుడు.. దీనికి తోడు పోలియోతో రెండు కాళ్లు వంకర్లు తిరిగి పనిచేయవు. అయితేనేం ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పని అయినా చేయవచ్చని నిరూపిస్తున్నాడు. జాజిరెడ్డిగూడేనికి చెందిన సయ్యద్‌ హైదర్‌ అలీ కుమారుడు వాహిద్‌ అలీ. కుటుంబ పరిస్థితుల కారణంగా పదోతరగతితో చదువు మానేశాడు. తండ్రి వద్ద ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు తదితర వాహనాల టైర్లు పంక్చర్లు చేయడం నేర్చుకుని నాలుగేళ్లుగా పనిచేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాడు. రుణం మంజూరు చేస్తే దుకాణాన్ని అభివృద్ధి చేసుకుంటానని చెబుతున్నాడు.

మరో ఘటనలో..

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
నార్కట్‌పల్లి: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయం పంటలు సాగుచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతులను తికమక పెడుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఢిల్లీకి వెళ్లి వానాకాలం ఎంత ధాన్యం కొంటారో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టు పట్టిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చిట్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కోండురు శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి..

మరిన్ని వార్తలు