ఎంపీ కోమటిరెడ్డికి అవమానం: సీఎం కేసీఆర్‌ సభకు అందని ఆహ్వానం

23 Jun, 2021 03:39 IST|Sakshi

ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోండి

లోక్‌సభ స్పీకర్‌కు కోమటిరెడ్డి ఫిర్యాదు

తన నియోజకవర్గంలో సీఎం పర్యటనకు పిలవలేదని ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: తన నియోజకవర్గ పరిధిలో నిర్వ హించిన అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సమా చారం ఇవ్వకుండా ప్రొటోకాల్‌ ఉల్లంఘించిన అధి కారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.

కేంద్రమంత్రులను కలిసిన కోమటిరెడ్డి 
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ఆయన కార్యాలయంలో కోమటిరెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల కోసం విజ్ఞప్తులు అందించారు. అనంతరం కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీని కలిసి తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధి గురించి విన్నవించారు.

రోడ్డు కోసం వారిని బుజ్జగిస్తున్నారు
తన ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లే రోడ్డును వాసాలమర్రి గ్రామస్తులు అడ్డుకున్నందుకే సీఎం కేసీఆర్‌ అక్కడి ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. అందుకే వారికి అర చేతిలో వైకుంఠం చూపెడుతున్నారన్నారు. వాసాలమర్రి కార్యక్రమానికి తననెందుకు ఆహ్వానించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు