టీఆర్‌ఎస్‌ అంటే ‘టోటల్‌ రివర్స్‌ స్టాండ్‌’

5 Mar, 2021 03:38 IST|Sakshi

కొత్త నిర్వచనం ఇచ్చిన ఎంపీ రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అంటే ‘టోటల్‌ రివర్స్‌ స్టాండ్‌’ అని మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఒక అంశం గురించి చెప్పిన మాట మీద నిలబడకుండా, పూర్తిగా దానికి విరుద్ధమైన లైన్‌లో వెళ్లడంలో టీఆర్‌ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పండిపోయారని వ్యాఖ్యానించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టు కేవలం సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే కార్యరూపం దాల్చకుండా పోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కమీషన్లు వచ్చే అవకాశం ఉంటే వెంటనే డీపీఆర్‌ ఇచ్చేవారని, కమీషన్లు రావనే పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఐటీఐఆర్‌ విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లది దొంగాట అని వ్యాఖ్యానించిన రేవంత్‌.. మంత్రి కేటీఆర్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్‌కు సమాన ప్యాకేజీ అంటూ దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్‌ వేగంగా పడిపోతోందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు