గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు మంచి పరిణామం

10 Oct, 2021 04:22 IST|Sakshi
హీరో జగపతిబాబుకు మొక్కను బహూకరిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ 

సింబా– ది ఫారెస్ట్‌ మ్యాన్‌ షూటింగ్‌ లొకేషన్‌లో నటుడు జగపతిబాబు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌ఫండ్‌ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం మంచిపరిణామమని విలక్షణ సినీనటుడు జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపుదలను ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్‌ఫండ్‌ కల్పిస్తోందని పేర్కొన్నారు. శనివారం దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో ‘మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం’ అనే నినాదంతో రూపొందుతున్న ‘సింబా – ద ఫారెస్ట్‌ మ్యాన్‌’సినిమా షూటింగ్‌లో జగపతిబాబు పాల్గొన్నారు.

అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు అటవీఅధికారి పాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్‌ సంపత్‌ నంది, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగపతిబాబు ఇక్కడ మొక్కలు నాటారు. ఫారెస్ట్‌ అకాడమీ డైరెక్టర్‌ పీవీ రాజారావు, దర్శకుడు సంపత్‌ నంది, హీరోయిన్‌ దివి వధ్వకూడా మొక్కలు నాటారు. కాగా, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌కు మహాబిలం మొక్కను శ్రీనివాస్‌ బహూకరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు