మానవత్వం చాటుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌

26 Aug, 2021 09:40 IST|Sakshi
బీరువా అందజేస్తున్న సర్వర్‌ ఫౌండేషన్‌ బాధ్యులు 

సాక్షి, వెంకటాపురం(వరంగల్‌): నిరుపేద కుటుంబానికి చెందిన ముస్లిం యువతి వివాహానికి ములుగు సబ్‌రిజిస్ట్రార్‌ సాయం అందించి ఉదారత చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన గౌసియ అనే యువతి వివాహానికి సర్వర్‌ చారిటబుల్‌ ట్రస్టు, ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బీరువా అందించారు. గ్రామానికి చెందిన మహ్మద్‌ షాబీర్‌– తహెర దంపతులకు 5 మంది ఆడపిల్లలు ఉండగా గత 12 సంవత్సరాల క్రితం షాబీర్‌ మృతిచెందారు. దీంతో తల్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

తల్లి ముగ్గురు కూతుర్ల వివాహం చేయగా నాలుగో సంతానమైన గౌసియ వివాహం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. నిరపేద యువతి వివాహానికి సాయం అందించాలని సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా స్పందించిన సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ తనవంతుగా బీరువా అందించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, గ్రామస్తులు మామిడిపెల్లి రమేష్, చంటి సామ్యూల్, చంటి అనిల్, మహ్మద్‌ జహీర్, అంకూస్, జాకీర్, అఖిల్, తిరుపతి, జాన్, అశోక్, బన్ని, ప్రవీణ్, వివేక్, అనిల్‌ పాల్గొన్నారు.

చదవండి: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక

మరిన్ని వార్తలు