ఒకే కులం–ఒకే సంఘం.. 

4 Jan, 2021 01:26 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌. చిత్రంలో మేయర్‌ బొంతు, వీహెచ్‌ తదితరులు 

ఒకే గొడుగు కిందకు మున్నూరు కాపు సంఘాలు 

సమష్టిగా ముందుకు సాగాలని రాష్ట్ర సదస్సులో నిర్ణయం 

హాజరైన మంత్రి గంగుల, ఇతర నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇప్పటివరకు విడివిడిగా కార్యకలాపాలు నిర్వహించిన పలు సంఘాలు హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని బలిజ, కాపు, మున్నూరు కాపు సంఘ కార్యాలయం వేదికగా ఏకమ య్యాయి. ఒకే కులం–ఒకే సంఘం.. నినాదం తో ఆదివారం నిర్వహించిన ఈ రాష్ట్ర సదస్సుకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావుతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు. సదస్సు ప్రారంభంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్నూరు కాపు కులస్తులు ఇప్పటివరకు వివిధ సంఘాలుగా విడిపోయి ఉండ టం వల్లనే సామాజికవర్గం అభివృద్ధి వేగంగా జరగలేదని, ఇప్పు డు ఒకే సంఘంగా సమష్టిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ని అన్ని పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయని, రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే బీసీ కులాలకు 5 ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేశారని చెప్పారు. మున్నూరు కాపుల అభివృద్ధి కోసం సీఎంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.   

త్రి సభ్య కమిటీ ఏర్పాటు 
సదస్సులో భాగంగా మున్నూరు కాపు నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కాపు సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా మూడు నెలల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించి, రాష్ట్ర కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర కన్వీనర్‌గా పుటం పురుషోత్తం వ్యవహరిస్తారు. ఎన్నికల అధికారిగా జె.డి.లక్ష్మీనారాయణను నియమించగా, సంఘం బైలాస్‌ను టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్‌ వివరించారు. రిటైర్డ్‌ ఐజీ సుంకరి బాలకిషన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయ ర్‌ బొంతు రామ్మోహన్, నేతలు వద్దిరాజు రవిచం ద్ర, వి.ప్రకాశ్, డాక్టర్‌. కొండా దేవయ్య, మీసాల చంద్రయ్య, దేవన్న, గాలి అనిల్‌కుమార్, కొత్త లక్ష్మ ణ్, జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.   చదవండి: (ఐటీ ఉద్యోగులు స్కై వాక్‌ చేస్తూ ఆఫీస్‌లకు..)

సావిత్రిబాయి స్ఫూర్తితోనే గురుకులాలు: గంగుల 
సాక్షి, హైదరాబాద్‌: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలను స్థాపించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. మహిళల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యా సంస్థల్లో సగానికిపైగా బాలికల కోసమే కేటాయించిందని వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకులాలను అభివృద్ధి చేస్తామన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

మరిన్ని వార్తలు