Munugode Bypoll: మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి ..

2 Nov, 2022 15:13 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది.ఎన్నికకు(నవంబర్‌3) ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు, తమ మద్దతురాలు ఓటర్లకు జోరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే తమకు డబ్బులు ఇందలేదని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేస్తున్నారు.

రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి తక్కువ ఇచ్చారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు చెప్పిన విధంగా డబ్బులు పంచాలని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు. ఇదిలా ఉండగా ప్రచారం గడువు ముగిసినా మునుగోడులో నాన్‌ లోకల్స్‌ తిష్ట వేశారు. మునుగోడు మండలం కోతులారంలో 30 మంది నాన్‌ లోకల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తే  భోజనాల కోసం ఆగమంటూ తలా తోక లేని సమాధానాలు చెబుతున్నారు. ఇలా నియోజకవర్గంలోని చాలాచోట్ల ఇతర జిల్లాల నేతలు మకాం వేసినట్లు తెలుస్తోంది.
చదవండి: Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!

మరిన్ని వార్తలు