మునుగోడు ఉప ఎన్నిక.. రౌండ్‌ రౌండ్‌కి ఐపీఎల్‌ తరహాలో జోరుగా బెట్టింగ్‌!

2 Nov, 2022 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్‌ నడుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్‌ మాఫియా రంగంలోకి దిగింది. ఒకటికి రెండింతలంటూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ హోటల్స్‌లో తిష్ట వేసిన బుకీలు.. ఈమేరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ అడ్వాన్స్‌ లు పుచ్చుకుంటున్నారని సమాచారం.

డిపాజిట్‌ సాధించేదెవరు? కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్‌ సరళిపై ఐపీఎల్‌ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్‌ను.. బుకీలు రౌండ్‌ రౌండ్‌కు బెట్టింగ్‌ నిర్వహణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్‌ వ్యవహారం నడుస్తోంది.

మరిన్ని వార్తలు