ముస్లిం మహిళల మానవత్వం 

22 Apr, 2021 18:50 IST|Sakshi

అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు 

కాజీపేట: సాధారణంగా ఎవరి అంత్యక్రియలకైనా ముస్లిం మహిళలు బయటకురాకుండా పురుషులే పూర్తిచేస్తారు. కానీ పవిత్ర రంజాన్‌ మాసంలో ఓ మహిళ అంత్యక్రియలను సహచర మహిళలే ముందుండి పూర్తిచేసి మానవత్వమే గొప్ప అని నిరూపించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో ఉంటున్న ముస్లిం వృద్ధురాలు బుధవారం మృతి చెందింది.

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన జులేకా (70) ఇటీవల కాజీపేటలో అచేతనంగా పడి ఉండగా సీఐ నరేందర్‌ ఇచ్చిన సమాచారంతో ఆమెను ఆశ్రమంలో చేర్పించారు. ఇక్కడ వైద్యసాయంతో కోలుకోని వృద్ధురాలు బుధవారం కన్నుమూసింది. ఆమెకు సంబంధించిన వారెవరూ లేకపోవడంతో సహచర ముస్లిం మహిళల సహకారంతో ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీ సంప్రదాయ పద్ధతిలో ఆమెకు అంతిమ సంస్కారం పూర్తిచేశారు. దీంతో పలువురు యాకూబీని అభినందించారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు