నాబార్డ్‌ ఆర్థికసాయం చేయాలి: కేసీఆర్

27 Aug, 2020 20:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ల ఏర్పాటుకు నాబార్డ్‌ ఆర్థికసాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌తో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే. దేశంలో ఆహార ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మనదేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీని కోసం నాబార్డ్‌ అధ్యయనం చేయాలి. (కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!)

వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతోపాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ పోత్సహించాలి. కూలీల కొరత అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. నాటు వేసే, కలుపు తీసే, పంటలు కోసే యంత్రాలు అందుబాటులోకి రావాలి. వీటికి సంబంధించి సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. (పరీక్షలు వాయిదావేయాలని .. ఆమరణ నిరాహార దీక్ష)

మరిన్ని వార్తలు