నాగార్జునసాగర్: నాగార్జునకొండకు శనివారం నుంచి లాంచీల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కృష్ణా నదిలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో టీఎస్‌టీడీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లాంచీలను నాగార్జునకొండకు నిలిపి వేశారు. వర్షం, గాలి తగ్గడంతో ప్రస్తుతం లాంచీలు మొదలయ్యాయి.
వర్షం కారణంగా విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నాగార్జునసాగర్ సందర్శనకు తరలి వచ్చారు. లాంచీలు నిత్యం ఉదయం 9గంటల తర్వాత మొదలవుతాయి. మధ్యాహ్నం 2గంటల వరకు పర్యాటకుల సంఖ్యను బట్టి నాగార్జునకొండకు ట్రిప్పులు ఉంటాయి.