రైలు కిందపడి చావాలనుకున్నా.. బతికి సాధించా: ఎమ్మెల్యే జనార్ధన్‌ రెడ్డి

22 Sep, 2022 15:03 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ‘వ్యాపారం, రాజకీయాల్లోకి రాకముందు నేను కూడా ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. రైలు కిందపడి చనిపోయేందుకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లా. కానీ, చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నా. జీవితంలో పైకి ఎదగాలనే పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యాను. ఒకప్పుడు పనిలేని స్థాయి నుంచి.. ఇప్పుడు 7 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాను’.. అని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

 నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్‌ ప్రారంభోత్సవంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ఒకప్పుడు నాన్నతో గొడవపడి కేవలం రూ.30తో హైదరాబాద్‌ వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డానని ఆయన వివరించారు. యువత ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని హితవు పలికారు. నిరుపేద విద్యార్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
చదవండి: ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్‌.. అభిమానులతో ఆటలా! 

మరిన్ని వార్తలు