నాగులు మృతి

13 Sep, 2020 04:48 IST|Sakshi

రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం

ఖైరతాబాద్‌/అఫ్జల్‌గంజ్‌ (హైదరాబాద్‌): తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బైకెలి నాగులు (55) చికిత్స పొందుతూ శని వారం మృతి చెందినట్లు సైఫాబాద్‌ పోలీ సులు తెలిపారు. ఈ నెల 10న రవీంద్రభారతిరోడ్డులో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న నాగులును సైఫాబాద్‌ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిం చారు.  మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ 62 శాతం శరీరం కాలిపోవడంతో వైద్యానికి సహకరించక మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ నాగప్రసాద్‌ తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు చిన్నప్పటి నుంచి తెలంగాణ వీరాభిమాని. ఎక్కడ సభలు, సమా వేశాలు జరిగినా చురుగ్గా పాల్గొనేవా డని కుటుంబ సభ్యు లు తెలిపారు. ఆయన కు భార్య స్వరూప, కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్‌ ఉన్నారు. వీరు ఇద్దరూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు.  నాగులు కుటుంబం బండ్లగూడలోని రాజీవ్‌ గృహకల్పలో నివాసముంటోంది. నాగులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో హౌస్‌ కీపింగ్‌గా పనిచేస్తున్నారు. 

నా పిల్లల్ని ఆదుకోండి: మృతుడి భార్య  
ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం అంటూ తిరిగే నాభర్త మంటల్లో కాలుతూ కూడా జై తెలంగాణ అంటూ నినదించిండు. నా భర్త మమ్మల్ని వీడి వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన భౌతికదేహాన్ని మొదట కీసర అమరవీరులస్థూపం వద్దకు, అక్కడి నుంచి బండ్లగూడకు తరలించి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తాం. నా భర్త కోరిక మేరకు మా పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి మా కుటుంబానికి అండగా నిలవాలి. 

మరిన్ని వార్తలు