అమెరికాలో నల్గొండ యువకుడు మృతి

22 Nov, 2021 13:39 IST|Sakshi

సాక్షి, నల్గొండ: అమెరికాలో నల్గొండ యువకుడు మృతిచెందాడు. అమెరికా ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్(28) దుర్మరణం చెందాడు. కాగా రెండేళ్ల క్రితం శేకర్‌ ఉద్యోగ నిమిత్తం శేఖర్‌ అమెరికా వెశ్లాడు.

చదవండి: ‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు'

కొడుకు మరణ వార్తను ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు