ప్రకాశ్‌రాజ్‌ ఒక బఫూన్‌ 

8 May, 2022 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక బఫూన్‌ అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గురించి మాట్లాడేంత సీన్‌ ప్రకాశ్‌రాజ్‌కు లేదన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ మొనగాడైతే ‘మా’ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ మెప్పు కోసమే ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీనుద్దేశించి ప్రకాశ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

మరిన్ని వార్తలు