టీఆర్‌ఎస్‌కు షాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా

19 May, 2022 16:16 IST|Sakshi

తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార‍్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి.. టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 

గురువారం టీపీసీసీ చీఫ్‌ నేతృత్వంలో వారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. ఇక, నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్‌

మరిన్ని వార్తలు