శివ బాలకృష్ణ సోదరుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

15 Feb, 2024 19:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ సోదరుడు నవీన్‌ కుమార్‌కు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివ బాలకృష్ణ కేసులో ఆయన సోదరుడు నవీన్‌ కుమార్‌ కూడా అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల క్రితం శివబాలకృష్ణ బెయిల్‌ పిటిషన్‌ను కూడా నాంపల్లి ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది

కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏబీసీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆయన బినామీలను కూడా ఏసీబీ అదికారులు విచారించారు. మరోవైపు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరాతీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తున్నారు.
చదవండి: అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్‌

whatsapp channel

మరిన్ని వార్తలు