ప్రజాప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ

5 Feb, 2021 20:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకానందున ఆమెకు కోర్టు వారెంట్‌ జారీ చేసింది. ఈనెల 9లోగా ఈ వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు సమన్లు జారీ కాగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావులు కోర్టుకు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు