Nampally Exhibition Starting Date: నుమాయిష్‌కు ఏర్పాట్లు చకచకా 

29 Dec, 2021 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను జనవరి 1వ తేదీన ప్రారంభించడానికి ఎగ్జిబిషన్‌ సొసైటీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, ఫైర్‌ అనుమతులు లభించాయి. 

1500 స్టాళ్లు
► ఈ ఏడాది ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ప్రతియేటా 2200 స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. కరోనా కారణంగా 700 స్టాళ్లను తగ్గించారు. కేవలం 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారు.

► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకాశ్మీర్, వెస్ట్‌బెంగాల్‌ తదితర రాష్ట్రాల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి.  (చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఇంకొంత కాలం ఇంటి నుంచే!)

కోవిడ్‌–19 నిబంధనలతో  
ఎగ్జిబిషన్‌లో కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఎగ్జిబిషన్‌ కార్యదర్శి ఆదిత్య తెలిపారు. ఎగ్జిబిషన్‌ లోపల స్టాళ్ల నిర్వాహకులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి 1వ తేదీన గవర్నర్‌ చేతుల మీదుగా నుమాయిష్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. (చదవండి: న్యూఇయర్‌ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్‌)

మరిన్ని వార్తలు