స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి.. టీచర్‌ బ్రెయిన్‌ డెడ్‌.. జీవన్‌ దాన్‌ సంస్థ ద్వారా

25 Jun, 2022 15:33 IST|Sakshi
జక్కిడి విజయలక్ష్మి (ఫైల్‌)

సంస్థాన్‌నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్‌ డెడ్‌తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది.  నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్‌ స్కూల్‌లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్‌ డెడ్‌ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు.
ఇంటర్‌లో మళ్లీ వంద శాతం సిలబస్‌

అవయవాలు జీవన్‌దాన్‌ ట్రస్టుకు..
విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో  ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్‌ దాన్‌ సంస్థకు  రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్‌ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు.
బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది!

మరిన్ని వార్తలు