-

పాలుతాగావా.. బసవన్నా!

30 Jul, 2023 12:44 IST|Sakshi

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని కరన్‌కోట్‌ గ్రామంలోని బసవన్న దేవాలయంలో నందీశ్వరుడు పాలు తాగినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరన్‌కోట్‌ గ్రామంలోని మెయిన్‌ బజార్‌లో పురాతన బసవన్న దేవాలయం ఉంది. గ్రామానికి చెందిన పూజ, స్రవంతి శుక్రవారం ఆలయంలో నైవేద్యం సమరి్పచేందుకు వెళ్లారు.

అక్కడే ఉన్న నందీశ్వరుడి విగ్రహానికి పాలుతాపే ప్రయత్నం చేయగా... నిజంగా పాలు మొత్తం తాగినట్లు ఆ మహిళలు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పురాతన ఆలయం కావడంతో శనివారం ఉదయం ఆలయం ముందు భాగం కూలిపోయింది. ఇదంతా దేవుడి మహిమ అని త్వరలో ఆలయానికి మరమ్మతులు చేపడతామని  ఉప సర్పంచ్‌ హేమంత్‌కుమార్‌ తెలిపారు. నందీశ్వరుడు పాలు తాగిన విషయం నిజమేనని ఉపసర్పంచ్‌ కూడా చెప్పారు. 
బీసీలకు రెండు 

మరిన్ని వార్తలు