బండి సంజయ్‌ అరెస్ట్‌పై స్పందించిన జాతీయ బీసీ కమిషన్

27 Oct, 2020 20:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అరెస్ట్‌పై జాతీయ బీసీ కమిషన్‌ స్పందించింది. సంజయ్‌ మీద పోలీసుల దురుసు ప్రవర్తనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలంగాణ సీఎస్‌, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 5లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీనని కూడా చూడకుండా తనపై పోలీసులు దాడి చేశారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. సిద్ధిపేట సీపీ, సీఎం కేసీఆర్‌ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. తనపై దాడికి పాల్పడిన సీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలని, సస్పెండ్ చేయాలని ట్విటర్‌ వేదికగా కోరారు. చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి

కాగా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం సిద్దిపేటలోని లెక్చరర్స్‌ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్‌ తహసీల్దార్‌ (ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకుని నినాదాలు చేశారు. బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ

ఈ క్రమంలో సిద్దిపేటలో రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేటలో సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని సిద్దిపేట నుంచి కరీంనగర్‌కి తీసుకెళ్లారు. సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. చదవండి: సీపీని సస్పెండ్‌ చేయాలి: బండి సంజయ్‌

మరిన్ని వార్తలు