నదులకు జీవం పోశాం

27 Feb, 2022 02:01 IST|Sakshi
నదుల పరిరక్షణపై నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సును ప్రారంభిస్తున్న   మంత్రి నిరంజన్‌రెడ్డి. చిత్రంలో రాజేంద్రసింగ్, వి.ప్రకాశ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు 

కాళేశ్వరం ప్రాజెక్టుతో 200 కి.మీ. మేర సజీవంగా గోదావరి

సాగు ప్రాజెక్టుల నిర్మాణంతో పెరిగిన పంట దిగుబడులు

నదుల పరిరక్షణపై జాతీయ సదస్సులో మంత్రి నిరంజన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నదులకు జీవం పోసిందని, అందుకు గోదావరే సాక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కి.మీ. మేర గోదావరి నది నేడు సజీవంగా ఉందన్నారు. నదుల పరిరక్షణపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. నదులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ సదుపాయాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 8 ఏళ్లలో 3 శాతం పచ్చదనాన్ని పెంచామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు యావత్‌ దేశానికి ఆదర్శనమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఇలాంటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

నదులకూ హక్కులున్నాయి: వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా
రాజ్యాంగం ప్రకారం నదులకు సైతం హక్కు లుంటాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత దేశపౌరులపై ఉందని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. నదుల పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులకు బాధ్యత ఉన్న ట్లు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముం బైలోని ఐదు నదులు నామరూపాల్లేకుండా పోవడంతో ఆ స్థలాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు పట్టాలిచ్చిందన్నారు. తాము కేసు వేస్తే కోర్టు పట్టాలను రద్దు చేసి నదులను పరిరక్షించిందని చెప్పారు.

దేశ ప్రజలు నదులను ఒకప్పుడు తల్లిగా పూజించగా, నేడు మురికి కూపాలుగా తయారుచేశారని రాజేంద్రసింగ్‌ దుయ్యబట్టారు. అత్యధిక అక్షరాస్యతగల ఢిల్లీలో యమునా, హైదరాబాద్‌లో మూసీ నదికి పట్టిన దుస్థితే నిదర్శనమని ఆయన అన్నారు. నదులపై అడ్డగోలుగా ఆనకట్టలు కడితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతిం టుందని ఆందో ళన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా నదుల పరిరక్షణకు ఈ సదస్సులో ముసాయిదా మేనిఫెస్టో తయారు చేస్తామ న్నారు. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దేశంలో నదులకు ఈ దుస్థితి ఏర్పడిందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్‌ పేర్కొ న్నారు. నదుల పరి రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులను సైతం ప్రభుత్వాలు అమలు చేయట్లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకా‹శ్, కృష్ణా రివర్‌ ఫ్యామిలీ చైర్మన్‌ ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ సీఈ ఐఎస్‌ఎన్‌ రాజు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు