సెప్టెంబర్‌ 17 వేడుకల్లో అపశృతి.. జాతీయ జెండాను అలాగేనా ఎగురవేసేది?

17 Sep, 2022 14:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17 సందర్బంగా అధికార టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. భూపాలపల్లి కలెక్టరేట్‌లో జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, అనురాగ్‌ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ క్రమంలో జాతీయ జెండాకు వందనం సమర్పించిన తర్వాత తప్పిదం గమనించారు. జెండాను తలకిందులుగా ఎగురవేసినట్టు గ్రహించారు. దీనికి కారణమైన ఆర్‌ఎస్‌ఐ సదానందంను జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి సస్పెండ్‌ చేశారు. 

ఇలాంటి ఘటనే డిచ్‌పల్లిలో సైతం చోటుచేసుకుంది. ఎంపీడీవో ఆఫీసులో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధ్యక్షుడు భూమన్న డిమాండ్‌ చేశారు.

చదవండి: (అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన టీఆర్‌ఎస్‌ నేత కారు.. అద్దం పగులగొట్టి..)

మరిన్ని వార్తలు