పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా?

10 Jul, 2021 02:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు – రంగారెడ్డి ప్రాజె క్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా లేదా.. అనే అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చెన్నై ధర్మాసనం నివేదిక కోరింది. ఈ మేరకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టులో పర్యా వరణ ఉల్లంఘనలు జరిగాయని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ రామకృష్ణన్‌ బెంచ్‌ విచారించింది. ఉదండా పూర్‌ రిజర్వాయర్‌ కోసం 16 కిలోమీటర్ల అడ్డుకట్ట (బండ్‌) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతు న్నారని పిటిషనర్‌ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మా ణంలో పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు.

కాగా, 2016లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడితే ఇప్పుడు కేసు వేయడం నిర్ధేశిత లిమిటే షన్‌ సమయానికి విరుద్ధమని తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు ధర్మాసనానికి నివేదించారు. అయితే పిటిషనర్‌.. ప్రాజెక్టును సవాలు చేయడం లేదని, పర్యావరణ ఉల్లంఘనలపై కేసు దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ విచారణ చేపడతా మని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్‌ఈ, గనుల శాఖ, మహబూబ్‌నగర్‌ జిల్లా అసి స్టెంట్‌ డైరెక్టర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసిం ది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరి గాయో.. లేవో.. తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆగస్టు 27 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు